పెద్దకడబూరు మండలంలో గురువారం జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో,
టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి ఎన్. రమాకాంత్ రెడ్డి బుధవారం కీలక విజ్ఞప్తి చేశారు. ఓటర్లు తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కూటమి అభ్యర్థుల విజయం కోసం ఓటర్లు సహకరించాలని రమాకాంత్ రెడ్డి కోరారు.