భాష్యం స్కూల్ సీజ్ చేయాలని ఆర్‌పీఎస్‌ఎఫ్ డిమాండ్

1790చూసినవారు
భాష్యం స్కూల్ సీజ్ చేయాలని ఆర్‌పీఎస్‌ఎఫ్ డిమాండ్
ఆదోనిలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న భాష్యం స్కూల్‌ను సీజ్ చేయాలని ఆర్‌పీఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రదీప్ డిమాండ్ చేశారు. కర్నూలు, మంత్రాలయం ప్రాంతాల్లోని ఈ స్కూల్, పుస్తకాలు, యూనిఫారాలు, డొనేషన్లు, ఇతర కార్యకలాపాల పేరుతో తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తాలు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని పట్టించుకోని ఎంఈఓ, డిప్యూటీ డీఈఓలపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. సబ్ కలెక్టర్ సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్