మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు, సోమవారం పెద్దకడబూరు మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి సూచనలతో, పెద్దకడబూరు ఎస్సీ కాలనీలోని బూత్ నంబర్–206లో బీఎల్‌వో ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్ ఓటర్ వెరిఫికేషన్ నిర్వహించారు. అర్హులైన ప్రతి ఓటరు వివరాలు నమోదు అయ్యేలా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మంచోడి లక్ష్మి, మేకల రాజు, జె. ఏలీయా, ఎం. సుధాకర్‌తో పాటు ఓటర్లు పాల్గొన్నారు.