శుక్రవారం నౌలేకల్ గ్రామంలో ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. మండల తహసీల్దార్, ఎంపీడీవో హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. స్థానిక సమస్యలను అర్జీల రూపంలో అందిస్తే పరిష్కరిస్తామని, పరిష్కారం కాని వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం నాలుగు వారాల పాటు ప్రతి శుక్రవారం నౌలేకల్ గ్రామంలో కొనసాగుతుంది. కార్యక్రమంలో వీఆర్‌వో, రైతులు,
టీడీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.