ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోండి: టీడీపీ నేతలు

626చూసినవారు
ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోండి: టీడీపీ నేతలు
కర్నూలు జిల్లా, మంత్రాలయం నియోజకవర్గంలోని పెద్దకడబూరు మండలం చిన్నతుంబళంలో బుధవారం వికసిత్ భారత్ జీ రామ్ జీ పథకం కింద ఉపాధి హామీ పనులను టీడీపీ మండల అధ్యక్షులు గవిగట్టు మల్లికార్జున, సొసైటీ చైర్మన్ కందనాతి నరసప్ప, టీడీపీ గ్రామ అధ్యక్షులు నరసింహులు, టీడీపీ నేత ఏక్ హనుమంతు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నాయని, కూలీలు ఈ పనులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్