కౌతాళం మండలం కేంద్రంలో ఆదివారం టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ నేత చెన్న బసప్ప స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ జెండాను ఆవిష్కరించి, ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. టీడీపీతోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగిందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శివ మోహన్ రెడ్డి, కోట్రెష్ గౌడ్, కాశీ విశ్వనాథ్, మంజు, కురుగోడు, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.