రహదారికి అడ్డంగా కూలిన చెట్టు.. రాకపోకలకు అంతరాయం

4చూసినవారు
రహదారికి అడ్డంగా కూలిన చెట్టు.. రాకపోకలకు అంతరాయం
పెద్దకడబూరు గ్రామ శివారుల్లోని హాజీ మలంగ్ బాబా దర్గా సమీపంలో మంఠం రంగప్ప పొలం వద్ద పెద్ద చెట్టు ఆదోనికి వెళ్లే రహదారిలో ఆదివారం కూలిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారిలో చెట్టు కూలిపోయి గంటలు గడుస్తున్నా సంబంధిత అధికారులు స్పందించక పోవడంతో ఆ మార్గంలో వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి కూలిపోయిన చెట్టును తొలగించాలని కోరారు. చెట్టు కూలిన సమయంలో రహదారిలో వాహనాలు ఏవీ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్