ఎల్లెల్సీలో గుర్తు తెలియని మహిళా మృతదేహం

15చూసినవారు
పెద్దకడబూరు గ్రామ శివారుల్లో ఉన్న ఎల్లెల్సీ పరిధిలోని సల్లమ్మ వంక సమీపంలో బుధవారం గుర్తు తెలియని మహిళా శవం కొట్టుకొని వచ్చింది. ఎల్లెల్సీ కాలువలో కొట్టుకొని వచ్చిన శవం అండర్ గ్రౌండ్ బ్రిడ్జి వద్ద చెత్తాచెదారంతో కలిసి అక్కడే ఉండి పోయింది. దీంతో కాలువ వెంబడి వెళ్లే వాళ్లు గమనించి ఇరిగేషన్ సిబ్బందికి సమాచారం అందించారు. అయితే ఇరిగేషన్ సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో గుర్తు తెలియని శవాన్ని పట్టించుకొనే నాథుడే కరువయ్యారు.

సంబంధిత పోస్ట్