కర్నూలు జిల్లా, మంత్రాలయం నియోజకవర్గంలోని పెద్దకడబూరు మండలంలోని నౌలేకల్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీటి భద్రత - సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. జేఈ సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, గ్రామాలలో 90 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టడమే అని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం నీటి భద్రతపై రైతులకు అవగాహన కల్పించనుంది.