మాధవరం గ్రామంలో "వెన్నుపోటుకు రెండేళ్లు" కార్యక్రమం సందర్భంగా
వైసీపీ నాయకులు, కార్యకర్తలు
టీడీపీ ఇంచార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి నివాసం ఎదుట కవ్వింపు చర్యలకు పాల్పడటాన్ని
టీడీపీ మండల అధ్యక్షుడు గవిగట్టు మల్లికార్జున ఖండించారు. ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు ఉన్నప్పటికీ, ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తతలు సృష్టించడం సరికాదని ఆయన అన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేసి, శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కర్నూలు, మంత్రాలయం ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.