ఏరువాక పండుగ: పరుగు పందెం, లాంగ్ జంప్ విజేతలకు ప్రోత్సాహకాలు

1222చూసినవారు
ఏరువాక పండుగ: పరుగు పందెం, లాంగ్ జంప్ విజేతలకు ప్రోత్సాహకాలు
పెద్దకడబూరు మండలంలోని కంబళదిన్నె గ్రామంలో మంగళవారం ఏరువాక పండుగ సందర్భంగా నిర్వహించిన పరుగు పందెం, లాంగ్ జంప్ పోటీలలో విజేతలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. టీడీపీ నాయకులు నాగేంద్ర తరపున, పరుగు పందెం విజేత బోయ హనుమంతుకు రూ. 10 వేలు, లాంగ్ జంప్ విజేత పింజరి బాబుకు రూ. 5 వేలు నగదును టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి చేతుల మీదుగా అందజేశారు.

సంబంధిత పోస్ట్