కర్నూలు జిల్లా పెద్దకడబూరులో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి వేడుకలు
వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వైసీపీ నాయకులు పురుషోత్తం రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, రవిచంద్రారెడ్డి, ముక్కరన్న మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ పాలన స్వర్ణయుగం వంటిదని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పేదల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారని కొనియాడారు.