
నంద్యాలలో మూర్ఛతో వ్యక్తి మృతి
గడివేముల మండలం కొరటమద్దిలోని బంగారమ్మ దేవాలయం అరుగు వద్ద శనివారం కూర్చున్న గొల్ల సుబ్బరాయుడు (55) అనే వ్యక్తి అకస్మాత్తుగా మూర్ఛకు గురై పడిపోయాడు. స్థానికులు, వైద్య సిబ్బంది అతడిని చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు ఎస్సై నాగార్జున రెడ్డి తెలిపారు. మృతుడు కోవెలకుంట్ల మండలం బిజినవేముల గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. మృతదేహాన్ని అతని కుమారుడు సురేంద్రకు అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు.







































