పెన్సిల్‌తో ఎన్టీఆర్,చంద్రబాబు, లోకేష్ చిత్రాలను గీసిన చిత్రకారుడు

239చూసినవారు
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా, నందికొట్కూరుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు డా. దేశెట్టి శ్రీనివాసులు, పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు, ప్రస్తుత అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత లోకేశ్ ల చిత్రపటాన్ని పెన్సిల్ తో గీసి ఆవిష్కరించారు. 'సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు' అనే నినాదంతో పార్టీ ఆవిర్భవించిందని, పేద, బడుగు బలహీన వర్గాలకు సేవలు చేస్తూ 44వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్