నందికొట్కూరులోని అనసూయ చిన్నపిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 5 నెలల బాలుడు అబ్దుల్ రెహమాన్ మృతి చెందాడు. వైద్యం వికటించి బాలుడు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బుధవారం జరిగిన ఈ ఘటనపై వెంటనే ప్రభుత్వం స్పందించి, బాధితులకు న్యాయం చేయాలని, ఆసుపత్రి సిబ్బందిపై కేసు నమోదు చేయాలని కుటుంబ సభ్యులు, వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించి డిమాండ్ చేశారు.