గురజాడ అప్పారావు రచనలు నేటికీ స్ఫూర్తిదాయకం

1934చూసినవారు
గురజాడ అప్పారావు రచనలు నేటికీ స్ఫూర్తిదాయకం
సమాజంలోని మూఢాచారాలను ప్రశ్నించి, సాహిత్యం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన గురజాడ అప్పారావు రచనలు నేటికీ స్ఫూర్తిదాయకమని వక్తలు పేర్కొన్నారు. నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురజాడ జయంతిని నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. డి. నాగన్న ఆధ్వర్యంలో గురజాడ చిత్రపటానికి నివాళులర్పించారు. ‘కన్యాశుల్కం’తో సంఘ సంస్కరణకు బాటలు వేశారని తెలుగు శాఖ అధ్యక్షురాలు డా. విద్య వాసిని దేవి తెలిపారు. విద్యార్థులు గురజాడ దేశభక్తి గీతాన్ని ఆలపించారు.

సంబంధిత పోస్ట్