నంద్యాల జిల్లా సున్నిపెంటలోని ఎస్బిఐ బ్యాంకు ఆవరణలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఈ నెల 29న అర్ధరాత్రి బ్యాంకు ప్రాంగణంలో చిరుత తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వరుసగా రెండు రోజులు చిరుత కనిపించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ప్రజలు రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.