నంద్యాల జిల్లా బ్రాహ్మణకొట్కూరుకు చెందిన రామాంజనేయులు (30) ఆత్మహత్య చేసుకున్నాడు. లారీ డ్రైవర్‌గా పనిచేసే అతను మద్యానికి అలవాటుపడి కొంతకాలంగా పనికి వెళ్లడం మానేశాడు. ఆటో కొనడానికి డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను ఒత్తిడి చేయగా, మద్యం మానితే కొనిస్తామని చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన అతను ఈనెల 2న కల్లూరు మండలం పందిపాడు సమీపంలో పురుగుమందు తాగాడు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందగా పోలీసులు కేసు నమోదు చేశారు.