నంద్యాల: చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్

1663చూసినవారు
నంద్యాల: చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్
నంద్యాల రైల్వే స్టేషన్‌లో జీఆర్పీ పోలీసులు చోరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మంగత్ రామ్, రాజస్థాన్‌కు చెందిన కిరణ్ దేవిలను మొదటి ఫ్లాట్‌ఫారమ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి సుమారు రూ. 2.40 లక్షల విలువైన 15 గ్రాముల బంగారు గొలుసు, లాకెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్