నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ‘దీక్షారంబ్’ కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. డి. నాగన్న అధ్యక్షత వహించారు.
విద్యార్థులు క్రమశిక్షణ పాటిస్తూ ఉన్నత శిఖరాలకు చేరాలన్నారు. తరగతులకు క్రమం తప్పకుండా హాజరు కావాలని చదువుపై శ్రద్ధ పెట్టాలని తెలిపారు. ముఖ్యఅతిథి తాటిపాడు మాబు సాహెబ్ కళాశాల అభివృద్ధికి సహకరిస్తానన్నారు. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌కు వచ్చే నెలలో ఇన్వర్టర్ అందిస్తానని ప్రకటించారు. చదువుతో పాటు నైపుణ్యాలు పెంచుకోవాలని అధ్యాపకులు సూచించారు.