టమోటా బొలెరో బోల్తా.. ప్యాపిలి వాసి మృతి

1074చూసినవారు
టమోటా బొలెరో బోల్తా.. ప్యాపిలి వాసి మృతి
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం బి. కొత్తపల్లి సమీపంలో టమోటాలతో వెళ్తున్న బొలెరో వాహనం వెనుక టైరు పేలి బోల్తా పడింది. ఈ ఘోర ప్రమాదంలో నంద్యాల జిల్లా ప్యాపిలికి చెందిన రామాంజనేయులు (55) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బుక్కరాయసముద్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్