మిడుతూరు మండలంలో మంగళవారం పల్లె పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కూటమి నాయకులు పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్య గిత్త జయసూర్య పాల్గొని, పల్లె పండుగ 3. 0 పథకం ద్వారా ఉదయం 11 గంటలకు సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. కావున మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, పత్రికా విలేకరులు పాల్గొనాలని నాయకులు పిలుపునిచ్చారు.