నందికొట్కూరు మండలం బొళ్లవరం గ్రామంలో వేదవతి (19) అనే యువతి వివాహమైన రెండు నెలల్లోనే దాంపత్య కలహాల కారణంగా మనస్థాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.