
నందికొట్కూరు: ప్రాతకోటలో ట్రాక్టర్ పోటీల సందడి
పగిడ్యాల మండలం పడమర ప్రాతకోటలో శ్రీ కాశీ విశ్వేశ్వర నందీశ్వర స్వామి తిరుణాల సందర్భంగా బుధవారం ట్రాక్టర్ రివర్స్ గేర్ పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. నందికొట్కూరు రూరల్ సీఐ టి. సుబ్రమణ్యం ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. సంక్రాంతి వేళ గ్రామీణ క్రీడలు ప్రజలను అలరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. పోటీల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు.




































