
నందికొట్కూరులో రక్తంతో మంత్రి నారా లోకేశ్ చిత్రం
నందికొట్కూరుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు డా. దేశెట్టి శ్రీనివాసులు, మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం తన రక్తంతో ఆయన చిత్రాన్ని గీసి వినూత్న కళా ప్రయోగం చేశారు. లోకేశ్ ప్రజా సంక్షేమం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడుతూ, ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.







































