
నంద్యాలలో పి. పి మధుసూదన్ రెడ్డి హౌస్ అరెస్ట్ ఖండన
నంద్యాల విజయ డైరీ డైరెక్టర్ పి. పి మధుసూదన్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడాన్ని వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి సోమవారం తీవ్రంగా ఖండించారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ భాషా మధుసూదన్ రెడ్డి నివాసానికి చేరుకొని మీడియాతో మాట్లాడారు. అధికారం శాశ్వతం కాదని, చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. చట్టపరంగా సహకరిస్తామని, పోలీసులను అడ్డం పెట్టుకొని భయపెట్టే ప్రయత్నాలు సాగవని స్పష్టం చేశారు.








































