
చాగలమర్రి: 500 ఏళ్ల నాటి ఆలయానికి పూర్వవైభం
చాగలమర్రి మండలం ఇడమడక సమీపంలోని 500 ఏళ్ల నాటి శ్రీ తిరువెంగళనాథ స్వామి పురాతన ఆలయ పరిసరాలను హిందూ ఐక్య సంఘం, ఎస్ఎస్ఎఫ్, ఆర్ఎస్ఎస్ సభ్యుల పిలుపుమేరకు భక్తులు స్వచ్ఛందంగా శుభ్రపరిచారు. ముళ్ల కంపలు, చెట్ల పొదలను తొలగించి ఆలయానికి సున్నం రంగులు వేశారు. పండితుల ఆధ్వర్యంలో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి భక్తులు విరాళాలు ప్రకటించగా, సహకరించిన వారందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.







































