మార్కాపురం జిల్లా బెస్తవారిపేట ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నంద్యాల జిల్లాకు చెందిన అల్లా బకాష్ మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నంద్యాల జిల్లా అయ్యలూరు మెట్టకు చెందిన అల్లా బకాష్, ఖాసీం పీరాతోపాటు మరొకరు బైక్‌పై వెళ్తుండగా కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందిన అల్లా బకాష్ మృతదేహాన్ని, గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.