బేచంచెర్లలోని కొత్త బస్టాండు ఎదురుగా గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వేణు రెడ్డి (19) అనే యువకుడు మృతి చెందాడు. టిఫిన్ చేసేందుకు రోడ్డు పక్కన నిలుచున్న అతన్ని నాపరాళ్ల ట్రాక్టర్ ఢీకొట్టింది. స్థానికుల కథనం ప్రకారం, ప్రమాదవశాత్తు ఈ ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.