నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న నేతృత్వంలో సిబ్బంది కార్యాలయంలోకి ప్రవేశించారు. ఈ కార్యాలయంపై గతంలోనూ అవినీతి ఆరోపణలున్నాయి. ఒక ముఖ్య అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది.