నంద్యాల శ్రీనివాస్ సెంటర్‌లోని వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసిన చాకలి జమ్ములయ్య అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాల బైటిపేటకు చెందిన నిందితుడు గత ఐదేళ్లుగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు, వైఎస్సార్‌సీపీకి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ ఘటన వెనుక రాజకీయ దురుద్దేశం లేదని పోలీసులు స్పష్టం చేశారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.