నంద్యాలలో మైనార్టీ విద్యార్థుల కోసం నిర్మిస్తున్న ఉర్దూ జూనియర్ కళాశాల పనులు 95% పూర్తయ్యి కూడా నిలిచిపోయాయని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో కళాశాల ఆమోదం పొందిందని, అయితే కొత్త కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.