తన అక్రమ సంబంధం బయటపడటంతో భార్య సమీరా బేగం, ఆమె ప్రియుడు కలిసి తనపై హత్యాయత్నం చేశారని బాధితుడు షేరు బాషా ఆరోపించారు. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన షేరు బాషా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్తి కోసం, అక్రమ సంబంధానికి అడ్డు తొలగించుకోవడానికే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బాధితుడు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.