నంద్యాల సబ్ డివిజన్ శక్తి టీం సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్స్ ప్రసాదు వెంకటేశ్వర్లు, వన్ స్టాప్ సెంటర్ సిబ్బందితో కలిసి బండి ఆత్మకూర్ మండలం సంత జూటూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు శక్తి యాప్ గురించి అవగాహన కల్పించారు. శక్తి యాప్ నంబర్ 7993485111 ను తెలియజేసి, ఎక్కడైనా నేరాలు, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ జరిగితే అత్యవసర నంబర్లు 100, 112 లకు ఫోన్ చేయాలని, పోలీసులు తక్షణమే స్పందిస్తారని వివరించారు. తల్లిదండ్రుల మొబైల్ కు ఫేక్ యాప్ ల గురించి కూడా హెచ్చరించారు. మహిళల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై గురించి కూడా తెలిపారు.