నంద్యాల సబ్ డివిజన్ శక్తి టీం సభ్యులు హెడ్ కానిస్టేబుల్ డిఎన్ ప్రసాద్, వెంకటేశ్వర్లు బుధవారంమహానంది మండలం తిమ్మాపురం గ్రామంలోని కస్తూరిబా బాలికల విద్యాలయంలో బాల్య వివాహాలను అరికట్టడంలో అమ్మాయిల పాత్రపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్య వివాహాలు జరిగితే వెంటనే 1098కి కాల్ చేయాలని లేదా శక్తి యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్ నేరాలపై 1930కి, అత్యవసర పరిస్థితుల్లో 100, 112కి కాల్ చేయాలని తెలిపారు.