గురువారం మండల పరిధిలోని చిన్నరాజుపాలెం-క్రిష్ణగిరిమెట్ట గ్రామాల మధ్యలో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో నలుగురు గాయపడ్డారు. చిన్నరాజుపాలెం తండాకు చెందిన మౌలాలినాయక్, బాలస్వామినాయక్ లు బనగానపల్లికి కూలీ పనులకు వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న శివ, మనెమ్మలు ఢీకొన్నారు. క్షతగాత్రులను బనగానపల్లి వైద్యశాలకు తరలించారు.