బేతంచెర్ల: అదృశ్యమైన యువకుడు దొరికాడు

1885చూసినవారు
బేతంచెర్ల: అదృశ్యమైన యువకుడు దొరికాడు
బేతంచెర్ల సంజీవనగర్ కు చెందిన షేక్ నబి రసూల్ ఈ నెల 2న అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్నేహితులు సోషల్ మీడియాలో వారి ఆవేదనను పోస్ట్ చేయగా, హైదరాబాద్ నుంచి డోన్ వైపు వచ్చే రైలులో కొందరు యువకుడిని గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో వారు డోన్ వెళ్లి తమ కొడుకును సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చినట్లు తండ్రి తెలిపారు. ఈ సంఘటనతో యువకుడి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్