నంద్యాలలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

1521చూసినవారు
నంద్యాలలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
నంద్యాల మండలం రైతునగరం–సుబ్బారెడ్డిపాలెం గ్రామాల మధ్య వసంత గ్రీన్ హోమ్స్ వెంచర్ సమీపంలోని కే. సీ. కెనాల్ సబ్ బ్రాంచ్ వద్ద 30–35 ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి తలకు, ఎడమ కంటి పైభాగానికి గాయాలున్నాయి. లేత నీలం చెక్స్ ఫుల్ షర్ట్, నీలం జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ లేదా సీఐ (9121101092), ఎస్‌ఐ (8333955920)లను సంప్రదించాలని పోలీసులు కోరారు.

సంబంధిత పోస్ట్