నంద్యాలలో కారు-బైక్ ప్రమాదం

241చూసినవారు
నంద్యాలలో కారు-బైక్ ప్రమాదం
నంద్యాలలోని నవమాన్ ఆర్చ్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవనగర్‌కు చెందిన ఓబులేసు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గోడాన్స్ పక్కల సందు నుంచి అతివేగంగా దూసుకొచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో బాధితుడు ఎగిరి పక్కనే ఉన్న కాలువలో పడిపోయారు. చేయి విరిగి తలకు దెబ్బలు తగిలిన బాధితుడిని స్థానికులు చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్