ఆళ్లగడ్డ గ్రామీణం: కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని ఒకరు మృతి చెందారు. శుక్రవారం ఆళ్లగడ్డ మండలంలోని బత్తులూరు గ్రామ సమీపంలో ఉన్న 40వ జాతీయ రహదారి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం — కడప జిల్లా చెన్నూరు వెంకటరమణరెడ్డి (62), కుమారుడు ఇద్దరు కడప నుండి కర్నూలుకు కారులో బయలుదేరారు. ఆళ్లగడ్డ మండలంలోని బత్తులూరు గ్రామం వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది.ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకటరమణరెడ్డి స్థానిక ప్రజల సహాయంతో ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు.