సంజామల మండలంలోని సోముల గ్రామానికి చెందిన ఒక యువతి ఈ నెల 12వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులు పలు చోట్ల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో, యువతి తల్లిదండ్రులు శనివారం పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమణయ్య తెలిపారు.