చాగలమర్రి మండలం మూడురాళ్ళపల్లెకు చెందిన ఉపాధి కూలీ ఓబులమ్మ (65) బుధవారం ప్రమాదంలో మరణించారు. పని ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో కళ్లు తిరిగి కింద పడ్డారు. స్థానికులు 108 వాహనంలో కేరళ వైద్యశాలకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఓబులమ్మ మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.