నంద్యాల జిల్లా గోస్పాడు మండలం సాంబవరం గ్రామంలో ఆన్లైన్ బెట్టింగ్‌కు బానిసై అప్పుల ఊబిలో కూరుకుపోయిన శేషాద్రి (32), అంజిత (27) దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎనిమిదేళ్లుగా బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న శేషాద్రి ఆన్లైన్ బెట్టింగ్ కు అలవాటు పడి అప్పులు చేశారు. అప్పులు తీర్చలేక భార్యాభర్తలిద్దరూ ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సోమవారం తెలిపారు.