నంద్యాల రైతునగర్‌లో సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ భాస్కరన్ (రాజమండ్రి సెకండ్ బెటాలియన్) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పని నిమిత్తం బనగానపల్లెకు వచ్చి, పని పూర్తికాకపోవడంతో నంద్యాలలో ఉంటున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నంద్యాల ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అనారోగ్య కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.