నంద్యాల ఎస్పీ సునీల్ షోరాణ్ మాట్లాడుతూ, సైబర్ నేరగాళ్లు ప్రజల అమాయకత్వాన్ని ఆయుధంగా మార్చుకొని మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. సరికొత్త పద్ధతుల్లో మోసం చేస్తున్నారని, సైబర్ భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. నకిలీ APK ఫైల్స్ డౌన్లోడ్ చేయవద్దని, తెలియని వ్యక్తుల నుంచి వచ్చే వీడియో కాల్స్‌కు స్పందించవద్దని సూచించారు. వాట్సప్ ద్వారా పెళ్లి పత్రికలు పంపుతూ డబ్బులు కాజేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.