రూ.274 కోట్లు దోచి పరారైన డోన్ రియల్టర్!

938చూసినవారు
రూ.274 కోట్లు దోచి పరారైన డోన్ రియల్టర్!
డోన్ కు చెందిన ఒక స్థిరాస్తి వ్యాపారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలోని ప్రముఖుల నుంచి అప్పులు, పెట్టుబడుల రూపంలో ₹274 కోట్లు వసూలు చేసి అమెరికాకు పారిపోయాడు. మొదట్లో చిరుద్యోగిగా ఉన్న అతడు, స్థిరాస్తి వ్యాపారంలోకి అడుగుపెట్టి బెంగళూరులో ఆఫీస్ ప్రారంభించాడు. సొంత డబ్బుతో విదేశీ యాత్రలు, పార్టీలు ఏర్పాటు చేసి ప్రముఖులతో పరిచయాలు పెంచుకుని భారీగా డబ్బులు సేకరించినట్లు సమాచారం. కొద్ది రోజులుగా అతడు అందుబాటులో లేకపోవడంతో బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు, అయితే ఈ విషయం బయటకు చెప్పడానికి భయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్