ప్రతి అమ్మాయి మొబైల్‌లో శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి

2302చూసినవారు
ప్రతి అమ్మాయి మొబైల్‌లో శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి
నంద్యాల శక్తి టీం సభ్యులైన హెడ్ కానిస్టేబుల్ డిఎన్ ప్రసాద్, వెంకటేశ్వర్లు, మహిళా పోలీస్ లక్ష్మీదేవి ఆదివారం నంద్యాలలోని బీసీ వెల్ఫేర్ బాలికల హాస్టల్‌లో అమ్మాయిలకు నూతన మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఈ చట్టాలను తెలుసుకోవాలని, లైంగిక వేధింపులు లేదా దాడులు జరిగితే వెంటనే శక్తి యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ప్రతి అమ్మాయి మొబైల్‌లో శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో 100, 112 నంబర్ల పనితీరు గురించి కూడా వివరించారు.

సంబంధిత పోస్ట్