నంద్యాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమ్మాయిలకు ఆకతాయిల వేధింపులు, సైబర్ క్రైమ్, ఇవ్ టీజింగ్ పై అవగాహన కల్పించారు. ఎస్సై సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, యుక్త వయసులో ఆకర్షణలకు లోనై జీవితాలను నాశనం చేసుకోవద్దని, తల్లిదండ్రుల బాధ్యతలను గుర్తించాలని, అనామకులను, పోకిరీలను నమ్మవద్దని సూచించారు. చదువుపై శ్రద్ధ పెట్టి జీవితాలను తీర్చిదిద్దుకోవాలని, ఏదైనా సమస్య ఉంటే పోలీసులను సంప్రదించాలని తెలిపారు. ప్రతి అమ్మాయి సెల్ ఫోన్లలో 'శక్తి' యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.