నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల సమీపంలో శుక్రవారం రాత్రి నెల్లూరు-ముంబై హైవేపై ట్రావెల్స్ బస్సు టిప్పర్‌ను ఢీకొన్న ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చాగలమర్రికి చెందిన బస్సు తాడిపత్రి మండలం హాజీవలి దర్గాకు పుట్టు వెంట్రుకల శుభకార్యం నిమిత్తం ప్రయాణికులతో వెళ్తుండగా, కొలిమిగుండ్ల వద్ద డీజిల్ బంకులోకి వెళ్తున్న టిప్పర్‌ను ఢీకొట్టింది. సీఐ రమేశ్ బాబు సహాయక చర్యలు చేపట్టారు.