ముగ్గురు పిల్లలకు విషమిచ్చి, తానూ ఆత్మహత్య చేసుకున్న సురేంద్ర ఘటన విషాదం నింపింది. భార్య మరణంతో కష్టాల్లో కూరుకుపోయిన కుటుంబానికి పిల్లల ఆలనాపాలనా చూసుకునేవారు లేకపోవడం, కూలికి వెళ్తేగాని పూట గడవని పరిస్థితి, పిల్లలను చూసుకోవడం భారంగా భావించడమే ఈ అఘాయిత్యానికి కారణమని తెలుస్తోంది. తుడుమలదిన్నెలో జరిగిన అంత్యక్రియలకు సురేంద్ర బంధువులు, భార్య తల్లిదండ్రులు హాజరుకాకపోవడం మరింత విచారకరం.